Home » Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది..!

Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది..!

by Sravya
Ad

Border Gavaskar Trophy: ఈ సంవత్సరం చివర్లో ఇండియా టీం ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లబోతుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా అసిస్ గడ్డ మీద ఐదు టెస్టులు సిరీస్ లు ఆడబోతోంది. కాగా ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ నవంబర్ 22న పెద్ద వేదికగా స్టార్ట్ కాబోతోంది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ సిరీస్లో ఆడడానికి భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లబోతోంది 1991 – 92 నుండి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగా అడిలైడ్ లో మొదటి టెస్ట్ నిర్వహించడం ఆనవాయితీగా చూస్తున్నాం. నవంబర్ 22 నుండి 26 తేదీల మధ్య పెద్ద వేదికగా మొదటి టెస్ట్ జరగబోతోంది. డిసెంబర్ 6 నుండి 10 వరకు రెండవ టెస్ట్ జరుగుతుంది డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో పింక్ బాల్ తో నిర్వహించబోతున్నారు.

Advertisement

Also read:

Advertisement

భారత జట్టు ఆడబోతున్న ఐదవ డే అండ్ నైట్ టెస్ట్ ఇది. 2020 డిసెంబర్ తర్వాత ఆస్ట్రేలియా తో రెండవది. 2020 లో ఆడిలైట్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్టులలో కోహ్లీ సేన 36 రన్స్ కి అవుట్ అయిపోయింది. భారత జట్టుకి టెస్టుల్లో ఇదే అతి తక్కువ స్కోరు. ఆ టెస్ట్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డిసెంబర్ 14న మూడవ టెస్ట్ ప్రారంభం అవ్వబోతోంది.

డిసెంబర్ 26న మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్ కి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక జరగనుంది 2025 జనవరి 3న సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభం అవ్వనుంది. 91-92 నుండి ఇరుదేశాల మధ్యన బోర్డర్ గవస్కర్ ట్రోఫీని నిర్వహిస్తుండగా ఇండియా టీం వరుసగా మూడుసార్లు ట్రాఫి ని నిలబెట్టుకుంది. ఈ ట్రాఫి జరగబోతున్న టైంలో భారత మహిళా జట్టు వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మహిళల జట్ల మధ్య మొదటి వన్డే డిసెంబర్ 5న జరగబోతుండగా డిసెంబర్ 8వ తేదీన రెండవ వన్డే డిసెంబర్ 11న మూడవ వన్డే జరగబోతోంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading