ముఖ్యంగా మనం సినిమాలలో బాంబులను డిప్యూజ్ చేసే సీన్లను చాలానే చూస్తుంటాం. అందులో వారు వైరును కట్ చేసి..డిప్యూజ్ చేస్తారు. కానీ నిజ జీవితంలో అలాంటివి మనకెవ్వరికీ సరిగ్గా అసలు తెలియదు. కానీ బీడీఎస్ అంటే బాంబు డిస్పోసల్ స్క్వాడ్ వాళ్లు బాంబును డిప్యూజ్ చేయాలంటే మాత్రం ముందుగా వాళ్లు ఆ ఏరియాను వారికి అనుకూలంగా మార్చుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకుని.. ఆ తరువాత అక్కడికి వెళ్లడానికి ఒక సేఫ్ వేవ్ చూసుకుంటారు. సస్పెక్టివ్ ఐటమ్‌లో బాంబు ఉందో లేదో కే9 డాగ్ కన్‌ఫమ్ చేసిన తరువాతనే తెలుస్తుంది.
Advertisement
Advertisement
ఆ తరువాత టీమ్‌లో ఉన్న ఒక మెంబర్ దాని వద్దకు చేరుకుని 40 కేజీల బాంబు సూట్ వేసుకుని ఎక్స్ రే ఎక్విప్‌మెంట్ తీసుకుని అది ఏ టైప్‌కు సంబంధించినదో కన్‌ఫమ్ చేస్తారు. ఆ తరువాత ఆర్ఓవీ అనగా రిమోట్లి ఆపరేటెడ్ వెహికిల్ ద్వారా దానిని తీసి కంటైన్‌మెంట్ ఛాంబర్‌లో వేస్తారు. అందులో ఆ బాంబును ఎక్స్‌ప్లోడ్ చేస్తారు. ఇలాంటి వ్యవహారాలు మొత్తం బాంబు స్క్వాడ్ చూసుకుంటుంది. ఎందుకైనా ఇలాంటి వాటిపై మనకు కూడా ఓ అవగాహన ఉంటే బెటర్.
Ad