Home » పెప్సీ కోకాకోలా ల ఈ లొల్లి గురించి మీకు తెలుసా? దీని నుండి మ‌న‌మేం నేర్చుకోవాలి?

పెప్సీ కోకాకోలా ల ఈ లొల్లి గురించి మీకు తెలుసా? దీని నుండి మ‌న‌మేం నేర్చుకోవాలి?

by Azhar
Ad

పెప్సీని కాద‌ని జ‌నాలు కోక్ వెంట ప‌డుతున్న రోజుల్లో…. పెప్సీ యాజ‌మాన్యం త‌ల‌లు ప‌ట్టుకుంది. అరె… టేస్ట్ & ప్రొడ‌క్ట్ విష‌యంలో కోక్ కంటే మ‌న‌మే బెట‌ర్ గా ఉన్న‌ప్ప‌టికీ జ‌నాలు కోక్ వెంట ప‌డ‌డానికి కార‌ణం ఏంటా? అని అదే ప‌నిగా ఆలోచించి….1975 అమెరికాలో బ్లైండ్ టేస్ట్ టెస్ట్ అనే కాన్సెప్ట్ ను స్టార్ట్ చేశారు.

Advertisement

Advertisement

ఈ కాన్సెప్ట్ ప్ర‌కారం షాపింగ్ మాల్స్ , థియేట‌ర్స్ లాంటి జ‌న స‌మూహం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో పెప్సీ రిప్ర‌జెంట‌ర్లు ఒక గ్లాస్ లో పెప్సీని, ఒక గ్లాస్ లో కోక్ ను ఉంచుతారు. బ్రాండింగ్ కు సంబంధించిన లెబుల్స్ లేని రెండు డ్రింక్స్ ను తాగాలని కోరారు. అలా రెండిటిని టేస్ట్ చేసిన వారు పెప్సీ టేస్ట్ బాగుంద‌ని చెప్పారు ఆ త‌ర్వాత లేబిల్స్ తో ఉన్న డ్రింక్స్ తాగి త‌మ ఒపినీయ‌న్ చెప్ప‌మ‌న‌గా ఈ సారి చాలా మంది కోక్ బాగుంద‌ని చెప్పార‌ట‌! దీని కార‌ణం బాటిల్ మీద కోక్ స్టిక్క‌ర్ ను చూసి టేస్ట్ ల‌ను పోల్చ‌కుండా త‌మ మీద రుద్దబ‌డిన బ్రాండ్ ప్ర‌కారం కోక్ బాగుంద‌ని చెప్పేశార‌ట‌! దీన్ని బ‌ట్టి కోక్ సేల్స్ ఎక్కువ‌గా ఉండ‌డానికి కార‌ణం దాని మార్కెటింగ్ స్ట్రాట‌జీ , బ్రాండింగ్ అని తెలుసుకున్నారట‌. 2020 అమెరికాలో డ్రింక్స్ సేల్స్ ను గ‌మ‌నిస్తే 45 శాతం కోక్ ను కొంటుంటే , 25 శాతం మంది పెప్సీలు తాగుతున్నారు. దీనికంత‌టికీ కార‌ణం కోక్ బ్రాండింగ్!

మ‌న‌మేం నేర్చుకోవాలి?
య‌స్ …. బ్రాండింగ్ అనే ప‌దం యాడైతే చాలు సాధార‌ణ వ‌స్తువు కూడా బ్ర‌హ్మ ప‌దార్థంలా క‌నిపిస్తుంది. అందుకే మ‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక బ్రాండింగ్ ను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మ‌న విలువ అమాంతం పెరిపోతుంది. దాని కోసం ముందుగా మేల్కొని స‌రికొత్త‌గా ఆలోచించాలి.

Visitors Are Also Reading