వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా ఫైనల్ కు చేరింది. అయితే భారతజట్టు ఫైనల్ కు చేరడంలో స్టార్ పెసర్ మహమ్మద్ శమీ కీలక పాత్ర పోషించాడు. శమీ టీంలోకి వచ్చినప్పటి నుంచి కీలక వికెట్లు తీసి ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా జట్టుకు గాయంతో దూరమయ్యాడో అప్పటినుంచి శమీకి జట్టులో చోటుదక్కింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని శమీ రెండు చేతుల ఒడిసి పట్టుకున్నాడు. వరల్డ్ కప్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఆ తర్వాత ఇంగ్లాండుపై నాలుగు, శ్రీలంకపై ఐదు, దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక సెమీస్ లో అయితే ఏడు వికెట్లు తీసి జట్టును ఫైనల్ లో నిలబెట్టాడు. మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన షమీ 23 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో శమీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ అభిమానులు హార్దిక్ పాండ్యాకు ధన్యవాదాలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా గాయపడకుండా ఉంటే శమీకి జట్టులో స్థానం దక్కేది కాదని అంటున్నారు. సరైన సమయంలో పాండ్యా గాయపడ్డాడని అంటున్నారు.
Advertisement
Advertisement
హార్దిక్ కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వాలని ఇవ్వాలి అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్ గా ఉండి ఉంటే అతను కచ్చితంగా తుదిజట్టులో ఆడేవాడు. పెసర్లుగా బుమ్రా, సిరాజ్ లు కొనసాగేవారు. మూడవ పెసర్లుగా హార్దిక్ ఉండడంతో తుదిజట్టులో శమీకి చోటు దక్కడం కష్టమయ్యేది. హార్దిక్ ఆల్ రౌండర్ కాబట్టి అదనంగా ఓ బ్యాటర్ లేదా స్పిన్నర్ ని తీసుకునే వెసులుబాటు ఉండేది. మొదటి నాలుగు మ్యాచుల్లో ఇదే జరిగింది. మొత్తంగా ఓ స్టార్ ప్లేయర్ కి అయిన గాయం మరో ప్లేయర్ ను స్టార్ ను చేసింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.