Home » 2023లో అతిపెద్ద సంక్షోభం.. ఇక పేదవాడి పరిస్థితి ఏంటో..?

2023లో అతిపెద్ద సంక్షోభం.. ఇక పేదవాడి పరిస్థితి ఏంటో..?

by Sravanthi

ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వైపు వెళ్ళి పోతున్నాయి.. ఇందులో ఇండియా కొంత వరకు కంట్రోల్ చేసుకున్నా కానీ, వచ్చే ఏడాది వరకు ఇది సాధ్యమయ్యేలా లేదు. ఈ సమయంలో మనమంతా ఎవరికి వారే యమునా తీరే లాగా ఎవరి డబ్బు వ్యామోహం వారిదే.. ఇతరులతో నాకేం అవసరం నలుగురిలో నేను అంటూ బ్రతికేస్తున్నాం.. దీనికి తోడుగా పెరిగిన రేట్లు, బ్యాంకులో వడ్డీ రేట్లు పెరగడం దీని వల్ల ఎంతో మంది పేద ప్రజల నెత్తిన విపరీతమైన భారం పడుతూ వస్తోంది.

ALSO READ:అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!

దీన్ని ప్రభుత్వం కాస్త కంట్రోల్ చేసినా కానీ ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు నిపుణులు. వరల్డ్ బ్యాంకు చెప్పిన వివరాల ప్రకారం 2023 వరకు చాలా దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని అంచనావేసింది. 1970 లో వచ్చిన సంక్షోభం తరహాలో మళ్లీ రాబోతోందట. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా,ఉక్రెయిన్ యుద్ధాల ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద ఉంటుందని వరల్డ్ బ్యాంకు వేస్తున్న అంచనా. ప్రపంచ వృద్ధి రేటు కూడా 3.2% ఉండగా, 3.19% కి పడిపోయింది.

విద్యుత్ ధరలు పెరగడం, వడ్డీలు పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోవడం, దీనివల్ల వ్యవసాయంపై ఎఫెక్ట్ పడడం లాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా లాంటి సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ఒకదానిపై ఒకటి ఇంపాక్ట్ అవుతూ 64 రంగాలు ఏకధాటిగా కుదేలవుతూ దీని ప్రభావం అనేది ప్రజలపై పడడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ:సీరియ‌ల్ హీరో కౌశిక్ తండ్రిని ఆ స్టార్ హీరోలు తొక్కేశారా…? వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

Visitors Are Also Reading