Telugu News » Blog » సీరియ‌ల్ హీరో కౌశిక్ తండ్రిని ఆ స్టార్ హీరోలు తొక్కేశారా…? వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

సీరియ‌ల్ హీరో కౌశిక్ తండ్రిని ఆ స్టార్ హీరోలు తొక్కేశారా…? వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

by AJAY
Ads

సినిమా ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్న‌వాళ్ల‌ను తొక్కేసేవాళ్లు కూడా ఉంటార‌ని అప్పుడ‌ప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. కొంద‌రు ఆ వ్యాఖ్య‌లను ఖండిస్తే మ‌రికొందరు స‌మ‌ర్థిస్తూ టాలెంట్ ఉంటే ఎలాగైనా ఎదుగుతార‌ని అంటారు. కాగా తాజాగా సీరియ‌ల్స్ ద్వారా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు కౌశిక్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కృష్ణ కౌశిక్ చాలా సీరియ‌ల్స్ హీరోగా న‌టించి త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

Ads

కేవ‌లం హీరోగా కాకుండా విభిన్న పాత్ర‌ల‌లో న‌టించి న‌టుడుగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాల‌లోనూ న‌టించాడు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కౌశిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న తండ్రిని సినిమా ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌కుండా తొక్కేశారు అంటూ కౌశిక్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా తాను సినిమా అవ‌కాశాల కోసం టాలీవుడ్ లోని డైరెక్టర్ ల‌ను అంద‌రినీ క‌లిశాన‌ని చెప్పారు.

Ads

టాప్ డైరెక్టర్ లు అంద‌రినీ సంప్ర‌దించాన‌ని కానీ ఎవ‌రూ ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొంత‌మంది అడ్వాన్స్ లు ఇచ్చిన త‌ర‌వాత ఆ సినిమాలు క్యాన్సిల్ అయ్యాయ‌ని చెప్పారు. అంతే కాకుండా దూర‌దర్శ‌న్ లో తాను న‌టించిన కిట్టుగాడు సీరియ‌ల్ ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఎక్కువ‌గా చూసేవార‌ని చెప్పారు. త‌న‌కు త్రివిక్ర‌మ్ అవ‌కాశాలు ఇస్తాన‌ని చెప్పాడ‌ని కానీ ఆ త‌ర‌వాత ఇవ్వ‌లేద‌ని అన్నాడు.

Ad

టాలీవుడ్ లో రావు ర‌మేష్ గొప్ప న‌టుడు అని ఆయ‌న‌కు కూడా చాలా ఆల‌స్యంగా బ్రేక్ వ‌చ్చిందని చెప్పారు. అంతేకాకుండా త‌న తండ్రి ఎత్తు మ‌రియు ప‌ర్సనాలిటీ ఆయ‌న‌కు మైన‌స్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో త‌న‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని బాధ‌ప‌డుతుంటే ఒక‌ప్పుడు త‌న తండ్రిని ఇండ‌స్ట్రీలో పైకి రానివ్వ‌లేద‌ని చెప్పారు. త‌న తండ్రి అంద‌గాడ‌ని అన్నారు. ఇక హీరో బాలాదిత్య కూడా కౌశిక్ త‌మ్ముడు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. బాలాదిత్య తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.