Home » మన తెలుగులో భారీ నష్టాలు వచ్చిన సినిమాలు ఇవే..!

మన తెలుగులో భారీ నష్టాలు వచ్చిన సినిమాలు ఇవే..!

by Azhar
Ad

మన తెలుగులో ఈ మధ్య భారీ బడ్జెట్ లతో సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో చాల వరకు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేస్తూ.. పెట్టుబడులను రాబడుతుంటే కొన్ని సినిమాలు మాత్ర డిజాస్టర్ గా నిలిచి నష్టాలను మిగులుస్తున్నాయి. అలా ఇప్పటివరకు మన తెలుగులో భారీ నష్టాలూ తెచ్చిన సినిమాలు ఏవో చూద్దాం.

Advertisement

రాధేశ్యామ్ : ప్రభాస్ హీరోగా… పూజాహేగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల అయ్యింది. కానీ అభిమానులను ఆకట్టుకోలేదు. దాంతో రాధేశ్యామ్ కు 120 కోట్ల నష్టం వచ్చింది.

ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ కూడా ఉండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉండేవి. కానీ విడుదలైన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో… దీనికి 80 కోట్ల నష్టం మిగిలింది.

అజ్ఞాతవాసి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 60 కోట్ల లాస్ తో పోయింది.

స్పైడర్ : మహేష్ బాబు హీరోగా.. ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా స్పైడర్. ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించగా.. క్రైమ్ యాక్షన్ గా సినిమా వచ్చింది. కానీ జనాలకు అంతగా ఎక్కకపోవడంతో 60 కోట్ల నష్టం వచ్చింది.

Advertisement

సాహో : బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అంతవరకు వెళ్లలేకపోయింది. అందుకే 50 కోట్ల లాస్ వచ్చింది.

ఎన్టీఆర్ కథానాయకుడు : సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మొదటి భాగంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా అభిమానులను మెప్పించలేదు. దాంతో 50 కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ మహానాయకుడు : సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో రెండవ భాగంగా వచ్చిన ఈ సినిమా కూడా అభిమానుల మనలను పొందలేదు. దాంతో 40 కోట్ల లాస్ వచ్చింది.

సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా పిరియాడికల్ డ్రామాగ వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. కానీ జనాలు మాత్రం ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. దాంతో 40 కోట్ల నష్టం వచ్చింది.

1 నెన్నొక్కడినే : సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. అభిమానులకు మొదట్లో అంతగా అర్ధం కాలేదు. అందుకే సినిమాను చూడలేదు. అందువల్ల 40 కోట్ల లాస్ వచ్చింది.

బ్రహ్మోత్సవం : మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత కలిసి నటించిన బ్రహ్మోత్సవం సినిమాను అభిమానులు మొదటిరోజే రిజెక్ట్ చేసారు. దాంతో ఈ సినిమాకు 35 కోట్ల నష్టం వచ్చింది.

ఇవి కూడా చదవండి :

బెంగళూరు ఓటమిని పిల్లి పైన తోసేస్తున్నా ఫ్యాన్స్..!

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading