Home » Bigg Boss ott : ముమైత్ ఖాన్ అవుట్..!

Bigg Boss ott : ముమైత్ ఖాన్ అవుట్..!

by AJAY
Published: Last Updated on
Ad

బిగ్ బాస్ ఓటిటి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా పాపులర్ అయిన ఈ షోకు ప్రతేకమైన అభిమానులు ఇదిలా ఉండగా తెలుగు ఓటిటి బిగ్ బాస్ ప్రారంభం అయ్యి నేటితో వారం పూర్తయ్యింది. ఇక ఆదివారం కావడం తో ప్రతివారం లాగానే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక మొదటి వారం నామినేషన్ లో నటరాజ్ మాస్టర్, అరియానా, హమీదా, మిత్ర శర్మ, ఆర్ జే చైతూ, సరయు, ముమైత్ ఖాన్ లు ఉండగా వారిలో నుండి ముమైత్ ఖాన్ ఈరోజు ఎలిమినేట్ అయ్యింది.

Advertisement

Advertisement

సరయు ముమైత్ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారని ప్రకటించిన హోస్ట్ నాగార్జున చివరికి ముమైత్ ఖాన్ కు తక్కువ ఓట్లు రావడం తో హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 లో కొన్ని వారాల పాటు కొనసాగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి వారమే హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Visitors Are Also Reading