Home » ప్రెగ్నెన్సీ తో ఇబ్బందులు పడుతున్న లాస్య..వీడియో వైరల్

ప్రెగ్నెన్సీ తో ఇబ్బందులు పడుతున్న లాస్య..వీడియో వైరల్

by Bunty
Ad

ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ లాస్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముఖ్యంగా చీమ, ఏనుగు మీద వేసే జోక్స్ ప్రతి ఒక్కరిని నవ్వించేలా ఉంటాయి. ఇక బుల్లితెరపై తన మాటలతో ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది లాస్య. అయితే గత కొంతకాలంగా ఈమె యాంకర్ గా దూరంగా ఉన్నది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా లాస్య రెండోసారి తల్లి కాబోతున్నారు. నిండు గర్భిణిగా ఉన్న లాస్యకు త్వరలో ప్రసవం కానుంది.

Advertisement

ప్రెగ్నెంట్ పీరియడ్ ఆడవాళ్లకు మరో జన్మతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ కారణంగా పెరిగిన పోట్ట ఏ పని సులభంగా చేసుకొనివ్వదు. కూర్చోవడం, పడుకోవడం, నడవడం కూడా కష్టమే. గర్భవతిగా తన ఇబ్బందులు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే భర్త మంజునాథ్ ఎలా దగ్గరుండి చూసుకుంటున్నారు ఆ వీడియోలో తెలియజేశారు. అమ్మలా చూసుకునే భర్త ఉండగా తనకు ఎంత కష్టమొచ్చినా ఎదుర్కోగలనని లాస్య పరోక్షంగా తెలియజేశారు.

ఇటీవల లాస్య సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. తల్లిగా పట్టుబట్టల్లో లాస్య కుందనపు బొమ్మల మెరిసారు. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సైతం సందడి చేశారు. ఇక అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. తమ అభిమాన యాంకర్ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

READ ALSO : ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన NRI భర్త

Visitors Are Also Reading