ప్రస్తుతం ఉన్న బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో మనందరికీ తెలుసు. అలాంటి బిగ్ బాస్ ముందుగా హిందీలో మొదలైంది. ఇప్పుడు అక్కడ 15వ సీజన్ కొనసాగుతోంది.. ఆ తర్వాత 2017 లో తెలుగులో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్ కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. అలాంటి బిగ్ బాస్ ఆరో సీజన్ చాలా డల్ గా మొదలై వారం వారం కాస్త మెరుగుపడుతూ వచ్చింది.. ఈ తరుణంలో ఆరో సీజన్ లో 21 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో వారం వారం అనుకోని ఎలిమినేషన్స్ తో షో కు మరింత క్రేజ్ పెరిగింది.
Advertisement
also read:మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!
Advertisement
14వ వారం ఇనయా ఎలిమినేషన్ తర్వాత ఫైనలిస్టు ఎవరనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.. ఫైనల్ విన్నర్ ఎవరో తేలిపోయింది.. ఎలాగంటే.. బిగ్ బాస్ హౌస్ లో ప్రొడక్షన్ బాయ్ గా పనిచేసే వ్యక్తి కొన్ని సంచలమైన విషయాలను బయట పెట్టేశాడు.. అందులో ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని, మీకు అందులో కనబడేది కేవలం మెయిన్ డోర్ మాత్రమే కానీ చుట్టూ 26 డోర్లు ఉంటాయని అన్నారు. మేం వారికీ అన్ని అందిస్తూ ఉంటామని, ఎలిమినేషన్ తర్వాత ఓ సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని తెలియజేశారు. బయట వాళ్ల ఓటింగ్ తో ఏం సంబంధం ఉండదని కానీ ఈసారి స్క్రిప్ట్ మొత్తం ముందే డిసైడ్ అయిపోయిందని రేవంత్ విన్నర్ అవుతాడని తెలియజేశాడు..
ఆదిరెడ్డిని మొన్ననే ఎలిమినేట్ చేయాలనుకున్నారు, కానీ ఒక కామన్ మ్యాన్ ఇంతవరకు రావడం మొదటిసారి కాబట్టి అతన్ని హౌస్ లోనే ఉంచారు.. మేం మొత్తం 50 మంది పనిచేస్తామని, లోపల జరిగేది ఒకటి చూపించేది మరొకటి అంటూ తెలియజేశారు. ఈసారి షోకు అంత రేటింగ్ లేదు.. ఇనయ ఎలిమినేషన్ తో టిఆర్పి రేటింగ్ పెరిగిందని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.
also read: