ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పినప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుండి కొంత మంది ఎలిమినేషన్ విషయంలో మాత్రం తప్పు జరిగిందా అనిపిస్తుంటుంది! ఎందుకంటే స్ట్రాంగ్ అని ఫీల్ అయిన కంటెస్టెంట్స్ అప్పుడప్పుడు ఇంటిబాట పడుతుంటారు. అలా సీజన్ 1 నుండి ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి తప్పు అని భావించిన ఎలిమినేషన్స్ !
1) పిన్స్ :
బిగ్ బాస్ సీజన్ 1 లో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న ఫ్రిన్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు ఈ సీజన్ లో శివబాలాజీ గెలిచినప్పటికీ ….టాస్క్ లలో 100శాతం ఇచ్చింది మాత్రం ప్రిన్స్ యే!
Advertisement
2) రోహిణి
బిగ్ బాస్ సీజన్ 3 లో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ అలరించిన రోహిణి కూడా సడెన్ గా ఎలిమినేట్ అయ్యింది.
Advertisement
3) దేవి నాగవల్లి :
సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన దేవీ కూడా 3 వారమే ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి దేవీ చాలా నిక్కచ్చిగా ఆడుతూ మంచి ఇంప్రెషన్ ను పొందినప్పటికీ ఊహించని రీతిలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికొచ్చేసింది.
4) సరయు :
సీజన్ 5 లో బోల్ట్ లేడీ అంటూ ఇంట్రడ్యూస్ అయిన సరయు కూడా మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్ అన్యాయం అనిపించింది. బిగ్ బాగ్ హౌస్ లో ఫస్ట్ ఎలిమినేషన్ రెండు వారాల తర్వాత ఉంటే మంచిదని ఈమె విషయంలో చాలా మంది అభిప్రాయ పడ్డారు.
5) రవి
సీజన్ 5 నుండి టాప్ 5 కంటెస్టెంట్లలో రవి ఒకడు అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి రవి అనూహ్యంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ ఓటింగ్ వ్యవస్థపై మరోసారి చర్చ నడుస్తోంది