Home » డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ! భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో ఊహించని ట్విస్ట్ !

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ! భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో ఊహించని ట్విస్ట్ !

by AJAY
Ad

తిరుప‌తిలో ఓ భార్య త‌న భ‌ర్త‌కు రెండో పెళ్లి చేసిందంటూ ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పెళ్లి జ‌రిగి చాలా కాలం అవుతుంది కానీ ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తిరుప‌తికి చెందిన యువ‌కుడు టిక్ టాక్ ద్వారా ప‌రిచయం అయిన యువతి నిత్య ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా నిత్య ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టింది. ప్రస్తుతం త‌న భ‌ర్త త‌న‌ను విడిచిపెట్టి వెళ్లిపోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. త‌మ‌కు టిక్ టాక్ లో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని చెప్పింది.

Advertisement

మూడేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామ‌ని నిత్య వెల్ల‌డించింది. తాను హైద‌రాబాద్ లో ఉండేదానినని మూడు నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి ఇద్ద‌రం క‌లుసుకునేవాళ్ల‌మ‌ని నిత్య తెలిపింది. అంతే కాకుండా ప్ర‌తిరోజూ ఫోన్ మాట్లాడుకునేవాళ్ల‌మ‌ని పేర్కొంది. పెళ్లి చేసుకుందామ‌ని చెప్పిన‌ప్పుడు ఉద్యోగం చేయాల‌ని చెల్లి పెళ్లి చేయాల‌ని చెప్పాడ‌ని…దానికి తాను కూడా ఒప్పుకున్నాన‌ని నిత్యా తెలిపింది.

Advertisement

ఇక అత‌డు పెళ్లి చేసుకున్న విష‌యం త‌న‌కు తెలియ‌దని అంతే కాకుండా అబ్బాయి త‌ల్లిదండ్రుల‌కు కూడా ఆ విష‌యం తెలియ‌ద‌ని చెప్పింది. ఆ అమ్మాయిని ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ అమ్మాయి అంటే త‌మ అత్తా మామ‌కు ఇష్టం లేద‌ని వారికి తాను అంటేనే ఇష్ట‌మ‌ని చెప్పింది.

ఆ అమ్మాయికి మొద‌ట వివాహం జ‌రిగింద‌ని…ఓ బాబు కూడా ఉన్నాడ‌ని నిత్యా ఆరోపించింది. తాను త‌న అత్తామామ‌ల ఎదుట గుడిలో పెళ్లి చేసుకున్నామ‌ని అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పింది. పెళ్లి త‌ర‌వాత గొడ‌వ‌లు జ‌ర‌గ‌టంతో ఇద్ద‌రం వేరు వేరు కాపురాలు పెట్టుకున్నామ‌ని చెప్పింది. ఇక పెద్ద‌లు పంచాయితీలో ఇద్ద‌రి ద‌గ్గ‌ర ప‌దిహేను రోజుల చొప్పున ఉండాల‌ని చెప్పార‌ని కానీ త‌న భ‌ర్త త‌న వ‌ద్ద 5రోజులు కూడా ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Visitors Are Also Reading