ఐపీఎల్ 2025 సీజన్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చాలాసార్లు వరుస సమావేశాలు జరిపి రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ ఆటగాళ్ల రిటెన్షన్ కోసం రూల్స్ ని తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగా అన్ని ఫ్రాంఛైజ్లు శుక్రవారం రిటెన్షన్ విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలని ప్రకటించాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం ఐపీఎల్ జట్లు టీమ్స్ నుంచి ఆరుగురు ప్లేయర్లని రిటర్న్ చేయొచ్చు. ఇందులో క్యాప్డ్ ప్లేయర్స్, అన్ క్యాపిటల్ ప్లేయర్లు ఉంటారు. ఇదిలా ఉంటే మెగా వేలానికి ముందు కొన్ని టీమ్స్ బిగ్ స్టార్ లని వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారు. వీరికి ఐపీఎల్ వేలంలో రికార్డు ధరలని పలికే అవకాశాలు ఉన్నాయి. ఆ టాప్ 5 ప్లేయర్లు ఎవరో చూద్దాం.
రిషబ్ పంత్
Advertisement
చాలా కాలం నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఇప్పుడు 9 ఏళ్ల అనుబంధం ముగిసిపోనుంది. ఢిల్లీ జట్టు అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తాడు. కనుక అన్ని టీమ్స్ అతన్ని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్
Advertisement
కేఎల్ రాహుల్ ని లక్నో సూపర్ జాయింట్స్ వదులుకుంది. అయితే కేఎల్ రాహుల్ కి పక్కా డిమాండ్ ఉంది.
శ్రేయాస్ అయ్యర్
కేకేఆర్ తన టీంలో ఉంచుకోవడానికి ఆసక్తి చూపించలేదు. శ్రేయస్ కూడా ఎక్కువ ధరకు పలికే అవకాశం ఉంది.
Also read:
ఆర్ష్ దీప్ సింగ్
ఆర్ష్ దీప్ సింగ్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. ఐపీఎల్ వేలంలోకి ఈయన కూడా వచ్చారు.
ఇషాన్ కిషన్
26 ఏళ్ల ఇషాన్ ముంబై ఇండియన్స్ తరఫున 2018లో ఆడాడు. రిటెన్షన్ లిస్టులో ఈయన పేరు కూడా లేదు. ఇషాన్ కిషన్ ఐపిఎల్ వేలంలో ఎక్కువ ధర పలికే ప్లేయర్లలో ఒకరిగా ఉన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇది చూడండి!