Home » ముంబై ఇండియన్స్ కు భారీ షాక్…స్టార్ బౌలర్ దూరం…!

ముంబై ఇండియన్స్ కు భారీ షాక్…స్టార్ బౌలర్ దూరం…!

by Bunty
Ad

కాసుల పంట పండించే ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. డిసెంబర్ 19న మినీ వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ఐపీఎల్ లో పాల్గొనడానికి ప్లేయర్స్ పోటీ పడుతుంటే క్రేజ్ ఉన్న ఆటగాళ్లు మాత్రం దూరం అవుతున్నారు. వారిలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ కూడా చేరాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లలో ఆర్చర్ ఒకడు. భీకరమైన స్పీడ్ తో బంతులు వేస్తూ బ్యాట్స్మెన్ ని తికమక పెడుతూ ఉంటాడు.

Big shock for Mumbai Indians

అలాంటి ప్లేయర్ కోసం ఐపీఎల్ జట్లు పోటీ పడెందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. కానీ ఆర్చర్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధంగా లేడని సమాచారం. ఇప్పటికే కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఆ జాబితాలో ఆర్చర్ కూడా చేరినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. కాబట్టి తమ ప్లేయర్స్ కి పనిభారం లేకుండా ఉండాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

Advertisement

అందుకే ప్రధాన ప్లేయర్స్ ని ఐపీఎల్ లో కూడా ఆడకుండా చూస్తోంది. ఆర్చర్ ని కూడా వరల్డ్ కప్ నాటికి ఫిట్ గా ఉండేలా చూడాలని భావిస్తోంది. దాంతో 2024 ఐపీఎల్ కి ఆర్చర్ దూరం కానున్నాడు. ఆర్చర్ 2023లో ముంబై ఇండియన్స్ కి ఆడాడు. 8 కోట్లకు ముంబై అతన్ని కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది మినీ వేళానికి ముందు ముంబై అతన్ని రిలీజ్ చేసింది. దాంతో మినీవేలంలో ఈ ఆటగాడు మంచి ధర పలుకుతాడు అని అందరూ భావించారు. కానీ ఐపీఎల్ కి దూరం అయిపోయి ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చాడు ఆర్చర్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading