బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకులు దీనికి కనెక్ట్ అయిపోయారు. బిగ్ బాస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇందులో యాంకరింగ్ చేసే హోస్ట్ కన్నా బిగ్ బాస్ వాయిస్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. అక్కడ అతని వాయిస్ వినిపించగానే ప్రతి ఒక్కరూ అతను చెప్పినట్టు చేస్తారు.
Advertisement
Advertisement
ఇప్పటికే చాలామంది ఆ వాయిస్ ఎవరిది, అసలు బిగ్ బాస్ ఎవరు అని చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వివరాలు ఏమీ తెలియరాలేదు. ఇక బిగ్ బాస్ లో వచ్చే వాయిస్ ఎవరిది? అతను ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… బిగ్ బాస్ లో వాయిస్ వినిపించే వ్యక్తి పేరు శంకర్. ఇప్పటికే ఆరు సీజన్లలో విజయవంతంగా డబ్బింగ్ చెప్పి… ఇప్పుడు ఏడవ సీజన్లోకి కూడా డబ్బింగ్ చెబుతున్నారు. ఈ షో కన్నా ముందు ఎన్నో సినిమాలలో డబ్బింగ్ చెప్పి చాలా గుర్తింపుని తెచ్చుకొని బిగ్ బాస్ లోకి ఎంపిక అయ్యారు. అంతేకాకుండా సీరియల్స్, అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఇతని వాయిస్ మనం వినొచ్చు.
బిగ్ బాస్ ను తెలుగులో ప్రారంభించే ముందు దాదాపు 100 మంది నిర్వాహకులను పరీక్షించారట. చివరకు శంకర్ వాయిస్ నచ్చడంతో అతనిని ఎంపిక చేశారు. అతని గొంతు చాలా గంభీరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇతని వాయిస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇతని వాయిస్ ని చాలా మంది బయట కూడా ట్రై చేస్తూ ఉంటారు. శంకర్ ఒకప్పుడు సిఐడిలో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతేకాకుండా చాలా సీరియల్స్ లో, అడ్వర్టైజ్మెంట్స్ కి కూడా వాయిస్ అందిస్తారు.