తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో ఎంత ఫేమస్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ రెండు,మూడు సీజన్ ల వరకు ఈ షో గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ హోస్ట్ గా నాగార్జున ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్బాస్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోయింది.షో కీ వచ్చిన కంటెస్టెంట్ లు కూడా ఎంతో పేరు సంపాదించుకొని బయట సినిమా రంగాలలో రాణిస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ షో అంటే కొంతమందికి ఎంతో ఇష్టం ఉంటుంది.
Advertisement
also read:మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
Advertisement
కానీ మరి కొంత మందికి నచ్చదు.. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సెప్టెంబర్ 5 ఆదివారం రోజున ఆరో సీజన్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికి ఇరవై మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.. ఈ తరుణంలో ఈ షో గురించి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసిన వారు ఉన్నారు, అలాగే ఈ షోని విమర్శించే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు.. అయితే బిగ్ బాస్ షో గురించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. కాసులకు కక్కుర్తి పడే వారు ఉన్నంతకాలం ఇలాంటి షోలు వస్తూనే ఉంటాయని, ఈ బిగ్ బాస్ షో ద్వారా ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు అడగాలి అని అన్నారు..
ఈ బిగ్ బాస్ షో ఒక బూతుల షోగా మారిపోయిందని, ఇందులో నైతికత లేదని అన్నారు. అలాగే ఈ హౌస్ లోకి వింత జంతువులు వచ్చి వింతగా ప్రవర్తిస్తున్నాయంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నారాయణ. ఈయన గతంలో కూడా బిగ్ బాస్ షో పై విమర్శలు చేయడం మనం చూశాం. ప్రస్తుతం నారాయణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read:సినీ అభిమానులకు ఐబొమ్మ బిగ్ షాక్.. ఇక అప్పటి నుంచి శాశ్వతంగా సేవలు బంద్..!