బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన అభిమానులకు ఓ శుభ వార్త చెప్పారు. త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నారట. తాను ప్రేమించిన శివ కుమార్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొన్నేళ్లుగా వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కానీ, ఈ విషయాన్ని ఎక్కడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా? ప్రేమికుల? అన్న సందేహాలు చాలా మందికి వచ్చినప్పటికీ.. వారు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. దీనితో వారు ఫ్రెండ్స్ మాత్రమేనని అనుకునేవారు. కానీ, సడన్ గా మేము ప్రేమించుకుంటున్నామని.. పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపి షాక్ ఇచ్చారు.
Advertisement
Advertisement
బిగ్ బాస్ షో ద్వారా మాత్రమే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని బయటి ప్రపంచానికి తెలిసింది. మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నప్పటికీ.. ప్రేమ, పెళ్లి గురించి బయట ఎవ్వరికీ చెప్పలేదు. అయితే.. బిగ్ బాస్ షో లో ఫామిలీ వీక్ లో ప్రియాంక జైన్ కోసం శివ వచ్చాడు. ఆమెను ముద్దులతో ముంచెత్తాడు.పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ప్రియాంక అడగ్గానే.. నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే చేసుకుందాం అంటూ శివ క్లారిటీ ఇచ్చేసాడు. తాజాగా ప్రియాంక తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా పెళ్లి గురించి అప్ డేట్ ఇచ్చింది.
వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అసలు విషయం చెప్పింది. పెళ్లి తేదీ ఖరారు అయ్యాక.. ఆ తేదీ వివరాలు కూడా వెల్లడిస్తానని తన ఛానెల్ లో చెప్పింది. ఇదే కాకుండా మరో విషయాన్నీ కూడా ప్రియాంక పంచుకుంది. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభా శెట్టి కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. త్వరలోనే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకుంటోందని.. తనకి కూడా కంగ్రాట్స్ అని తెలిపింది. దీనితో, అభిమానులు ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!