సాధారణంగా నేరాలు చేసి జైలుకు వచ్చిన వాళ్లకు పోలీసులు పనుల్లోనే శిక్ష కూడా వేస్తూ ఉంటారు. జైలు లో గడ్డి పీకించడం దగ్గర నుండి ఎన్నో పనులను ఖైదీలతో చేయిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఎక్కువగా కష్టంగా ఉండే పనులే చెబుతూ ఉంటారు. కానీ ఓ జైలులో నేరాలు చేసి వచ్చిన ఖైదీలతో వేద మంత్రాలు చదివిస్తున్నారు. పురోహితులను జైలుకు పిలిపించి మరీ ఖైదీలకు మంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్ర కర్మాగారం లో జరుగుతోంది.
Advertisement
Advertisement
ఈ జైల్లో ఉండే ఖైదీలను పురోహితులు గా తీర్చి దిద్దే కార్యక్రమాన్ని పోలీసులు ముందర వేసుకున్నారు. ఇక ఖైదీలకు పురోహితులు యజ్ఞ ఖర్మలని నిర్వహించడం తో పాటు మరికొన్ని మత్రాలను నేర్పుతున్నారు. వారి జీవితంలో స్థిరపడటానికి అవసరమైన శిక్షణ అందిస్తున్నారు. దాంతో ఒకప్పుడు నేరాలు చేసిన ఖైదీలు ఇప్పుడు మంత్రాలు చదువుతున్నారు. ఇక ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు ఇలా చేయడం వల్ల అయినా వాళ్ళు చేసిన పాపాలకు ప్రయిశ్చితం కలుగుతుంది అంటున్నారు.