వైద్యులు ఆస్పత్రిలో లేరని నర్సులు బిడ్డను అడ్మిట్ చేసుకోలేదు. అప్పటికే బిడ్డ ఊపిరి ఆగిపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలలని చెప్పారు. కానీ ఆ తండ్రి ప్రేమ దానికి ఒప్పుకోలేదు. ఏడుస్తూనే తన బిడ్డకు సీపీఆర్ చేశాడు. దాంతో ఆ బిడ్డ తిరిగి లేచింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని బోజ్ పూర్ కు చెందిన అర్జున్ చౌదరి అనే వ్యక్తికి రిషబ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రిషబ్ ఆడుకుంటూ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడిపోయాడు. దాంతో వెంటనే స్పృహ తప్పిపోయాడు.
Advertisement
Advertisement
అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు అందుబాటులో లేరని ఆస్పత్రి స్టాఫ్ అడ్మిట్ చేసుకోలేదు. దాంతో ఆ బాబు తండ్రి అర్జున్ చౌదరి వెంటనే బాబు నోట్లో నోరు పెట్టి ఊదుతూ సీపీఆర్ చేశాడు. వెంటనే బాలుడు స్ప్రుహలోకి వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఆ తండ్రి ప్రేమకు జేజేలు కొడుతూ ఆస్పత్రి సిబ్బంధిపై వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.