పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా వేసుకున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కీలక పాత్రలో నటించారు.
పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యమీనన్ నటించగా రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే అన్ని సినిమాలకు ముందుగానే రివ్యూ ఇచ్చే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ఈ సినిమాకు కూడా రివ్యూ ఇచ్చారు. దుబాయ్ సెన్సార్ సభ్యులు అయిన ఉమైర్ సంధు ముందుగానే తెలుగు సినిమాలు చూస్తూ రివ్యూ ఇస్తున్నారు. అయితే అన్ని సినిమాలకు ఉమైర్ సంధు బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా భీమ్లా నాయక్ పై కూడా అలాంటి రివ్యూ నే ఇచ్చారు. భీమ్లా నాయక్ సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉందని పవన్ కళ్యాణ్ టెర్రిఫిక్ గా కనిపించాలని పేర్కొన్నారు. సినిమా పక్కా హిట్ అవుతుందని పేర్కొన్నారు. ఇక గతంలో కూడా అజ్ఞాతవాసి సినిమాకు ఉమర్ సందు ఇలాంటి రివ్యూనే ఇచ్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ ఫ్యాన్స్ ఉమైర్ అన్ని సినిమాలకు ఇలాంటి రివ్యూలే ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు