Home » ఓటీటీ రిలీజ్ కు సిద్ద‌మ‌వుతున్న భీమ్లానాయ‌క్..? ఎప్పుడంటే..!

ఓటీటీ రిలీజ్ కు సిద్ద‌మ‌వుతున్న భీమ్లానాయ‌క్..? ఎప్పుడంటే..!

by AJAY
Ad

క‌రోనా కేసులు తగ్గుముకం ప‌ట్టడంతో విడుద‌ల‌ను వాయిదా వేసుకున్న ఒక్కోసినిమా మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రానా కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంతగానో మెప్పించ‌గా సాధార‌ణ ప్రేక్ష‌కులు మాత్రం యావ‌రేజ్ గా ఉంద‌ని చెబుతున్నారు.

Bheemla nayak dialogues

Advertisement

Advertisement

అయితే మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ తో సినిమా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ హౌస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈచిత్రానికి క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురుస్తోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల‌ను క‌లెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ఓటీటీ విడుద‌ల‌కు కూడా సిద్ద‌మ‌వుతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

Bheemla nayak

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా మార్చి చివ‌రి వారంలో ఈ సినిమా ఓటిటిలో ప్ర‌సారం అయ్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఖ‌చ్చిత‌మైన తేదీని మాత్రం ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ట‌. కాబ‌ట్టి అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మార్చి చివ‌రివారంలో భీమ్లానాయ‌క్ ఓటిటిలోకి రావ‌డం ప‌క్కా.

Visitors Are Also Reading