పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలతో పాటూ స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ చిత్రంలో నిత్యామీనన్ పవన్ కు జోడీగా నటించగా సంయుక్త మీనన్ రానాకు జోడీగా నటించింది. నిజానికి ఈ సినిమాను మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా తెరకెక్కించారు.
Advertisement
అయితే ఈ సినిమాలో విలన్ అంటూ ఉండరు. ఇద్దరి మధ్య ఉండే ఈగోనే విలన్ గా చూపిస్తారు. కానీ తెలుగులో రానా కంటే పవన్ కల్యాణ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని…రానాను విలన్ గా చూపిస్తారు అని అంతా సినిమా విడుదలకు ముందు అనుకున్నారు. కానీ అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా వచ్చిన భీమ్లానాయక్ చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే భీమ్లానాయక్ లో ఎక్కడా రానాను తక్కువ చేసి చూపించలేదు. రానా పవన్ ఇద్దరి పాత్రలకు కూడా ప్రముఖ్యతను ఇచ్చారు.
Advertisement
సినిమాలో రానా డానియల్ శేఖర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తన పాత్రకు ప్రాధాన్యత ఉండటం రానా నటనలో చింపేయడంతో విమర్శల చేత ప్రశంసలు అందుకున్నాడు. అయితే నిజానికి ఈ పాత్రకోసం మేకర్స్ మంచు విష్ణును సంప్రదించారట.కానీ మంచు విష్ణు మా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు నో చెప్పారట. అలా మంచు విష్ణు నో చెప్పడంతో డానియల్ శేఖర్ పాత్ర రానా వద్దకు వచ్చింది. లేదంటే భీమ్లానాయక్ లో విష్ణు పవన్ మధ్య వార్ చూడాల్సి వచ్చేది.