టాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాను శ్రీ మెహ్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. 2021 వరకు పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు విజయం దక్కలేదు. ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా ఆమె నెటిజన్లను ఆమె అలరిస్తోంది.
READ ALSO : కృష్ణ చేయాల్సిన మూవీ..కానీ వెంకటేష్ ఎందుకు చేశాడు !
Advertisement
తాజాగా ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. “వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్ళు ఎప్పటి లాగానే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు. తమకంటే వయసులో చాలా చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు.
Advertisement
READ ALSO : బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కాడు.. తిరుపతిలో కారు బీభత్సం
పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. ధైర్యవంతులు స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది. దీనిని మీరు అంగీకరిస్తారా?” అని భాను శ్రీ ప్రశ్నించారు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో భాను శ్రీ మెహ్ర.. ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
READ ALSO : కృష్ణ చేయాల్సిన మూవీ..కానీ వెంకటేష్ ఎందుకు చేశాడు !