ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అనే విషయం అందరికి తెలిసిందే. ఒక్క బాహుబలి సినిమాతో ప్రభాస్ సినిమా కెరియర్ గ్రాఫ్ అనేది పూర్తిగా మారిపోయింది. అయితే ఈ బాహుబలి మొత్తం పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ కావడంతో.. అప్పటి నుండి అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా కోసం సీనియర్ దర్శకుల పైన మాత్రం ఆధారపడటం లేదు.
Advertisement
ప్రభాస్ బహువాలి తర్వాత ఇప్పటివరకు విడుదల చేసిన రెండు సినిమాల తో పాటుగా.. తర్వాత చేయబోతున్న సినిమాలు అన్ని కూడా కొత్తగా వచ్చిన దర్శకులతోనే చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన యువ దర్శకులు అందరూ కూడా ప్రభాస్ కోసం తమ కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభాస్ కు కథ చెప్పే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
Advertisement
అయితే ఈ లిస్ట్ లోకి తాజాగా బింబిసారా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్లిడి వశిష్ట కూడా చేరిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మల్లిడి వశిష్ట మాట్లాడుతూ.. తాను ప్రభాస్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిపాడు. అది కూడా మాములు కథ కాదు.. మన స్వతంత్ర సమరయోధుల్లో ప్రముఖుడు అయిన భగత్ సింగ్ జీవిత కథను ఆధారం చేసుకొని.. ఓ కథను సిద్ధం చేశాను అని చెప్పాడు. ప్రభాస్ కథ చెప్పే అవకాశం ఇస్తే చెప్పి ఒప్పిస్తాను అని కూడా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :