చైనాలో మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా వైరస్. కరోనా వైరస్ కు జన్మనిచ్చిన దేశంలోనే మరోసారి వైరస్ వర్రీ అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రాగన్ కంట్రీలో కొత్తగా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవ్వడంతో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు
Advertisement
వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్ కు వ్యాపించడం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటివరకు మూడు నమోదు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Advertisement
గుజరాత్ లో రెండు కేసులు నమోదు కాగా, ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ వేరియంట్ వివరాలు వెల్లడించారు నిపుణులు. బిఎఫ్ 7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది.
READ ALSO : Pragathi : ఏంటీ.. ప్రగతి ఆంటీ హీరోయిన్ గా చేసిందా..?