ఒంటెలను ఎడారి ఓడలు అంటారు. ఎడారిలో ఎంతదూరమైనా ఎర్రటి ఎండలో, భగ్గుమనే ఇసుకలో ఇబ్బందలు లేకుండా ప్రయాణం చేయగలుగుతుంది. వారంలో ఒకసారి మాత్రమే నీళ్లు తీసుకుని ఏడు రోజులపాటు నీళ్లు లేకపోయినా ప్రయాణం చేయగలుగుతంది. ఎడారి దేశాల్లో ఒంటెలను రవాణా సాధానాలుగా వినియోగిస్తారు.
ఒంటెలపై ప్రయాణం చేయడం ఎప్పుడూ మజాగానే ఉంటుంది. ఎంత బరువునైనా సరే అవలీలగా మోస్తాయి. ఒంటెలపాలు చాలా ఆరోగ్యం. అందుకే ఎడారి ప్రాంతంలో ఆవుల కంటే ఒంటెలను ఎక్కువగా పెంచుతారు. ఒంటెపాలల్లో ఔషదగుణాలు అనేకం ఉంటాయి. ఏ ప్రాణికైనా లైఫ్ స్పాన్ కొంతవరకే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలుగుతుంది. ఏడారిలో ఒంటెలు మరణిస్తే వాటిని కోసి ఆహరంగా వినియోగిస్తుంటారు. చనిపోయిన ఒంటెను ముట్టుకోకుండా అలానే వదిలేస్తే దాని శరీరంలోకి బ్యాక్టీరియా, గ్యాస్‌లు ఉత్పత్తి అయ్యి క్రమంగా ఉబ్బిపోతుంది. ఒకానోక దశలో ముట్టుకుంటే చాలు టప్‌మని బుడగలా పేలిపోతుంది. అందుకే ఎడారిలో మృతి చెందిన ఒంటెల కళేభరాలను ముట్టుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు.
Advertisement