మాస్ బీట్ లు, లవ్ సాంగ్ లు ఇతర ఏ సాంగ్స్ చేయాలన్నా ఎంతో మంది కొరియోగ్రాఫర్ లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ క్లాసికల్ డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువమంది కొరియోగ్రాఫర్ లు ఉన్నారు. అలాంటి వారిలో శివశంకర్ మాస్టర్ కూడా ఒకరు. శివశంకర్ మాస్టర్ తన కెరీర్ లో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
కానీ తన కెరీర్ లో రెండు సినిమాలు రావడం అదృష్టం అని వాటిని మర్ఛిపోలేను పలు సంధర్భాలలో చెప్పారు. ఇక ఆ రెండు సినిమాలు కూడా మన తెలుగు సినిమాలే కావడం అదృష్టమే చెప్పాలి. ఇక ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు కావడంతో పాటు తన కొరియోగ్రఫీకి గానూ ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి…ఆ సినిమాల గురించి శివశంకర్ మాస్టార్ ఏం చెప్పారు. అన్నది ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
అనుష్క కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో అరుంధతి కూడా ఒకటి ఈ సినిమాను కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పశుపతి క్యారెక్టర్ లో నటించిన సోనూసూద్ ను చంపే సీన్ సినిమాకే హైలెట్ గా నిలించింది. ఇక అన్ని సినిమాలలో కాకుండా ఈ సినిమాలో భు భు భుజంగం దిది తరంగం అనే పాటకు నాట్యం చేస్తూనే అనుష్క సోనూసూద్ ను అంతం చేస్తుంది. ఇక సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది శివశంకర్ మాస్టర్ కావడంతో ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఈ పాటను కేవలం 32రోజుల్లోనే ఈ పాటను పూర్తిచేయడం విశేషం. అంతే కాకుండా అనుష్కకు పెద్దగా క్లాసికల్ డ్యాన్స్ రాకపోవడంతో ఎంతో కష్టపడి ఆమెకు భంగిమలు నేర్పించారట.
రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్, తెలుగు సినిమా రేంజ్ ను పెంచేసిన సినిమా మగధీర లో ధీర ధీర ధీర…పాటకు కూడా శివశంకర్ మాస్టరే కోరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు కూడా ఆయన ప్రశంసలు అందుకోవడంతో పాటూ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 22 రోజుల్లోనే ఈ పాటను కూడా పూర్తిచేశారు.