జివితంలో అత్యంత ముఖ్యమైన విషయాలలో వివాహం కూడా ఒకటి. మనిషి జీవితం పెళ్లికి ముందు పెళ్లి తరవాత పూర్తిగా మారిపోతుంది. అయితే ఆ మార్పు కొంతమందిలో మంచిగా జరిగితే మరికొందరిలో వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల చెడుగా కూడా మారిపోవచ్చు. అందువల్లే వివాహం విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే కాకుండా ఏ వయసులో వివాహం చేసుకుంటే మంచిది…..ఎవరిని వివాహం చేసుకోవాలి అన్నదానిపై కూడా ఓ క్లారిటీ ఉండాలి.
Advertisement
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 30ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటేనే మంచిదని మానసిక నిపుణులు చెడుతున్నారు. అందుకు ఊదాహరణగా ఇటీవల ప్రధాని మోడీ మహిళల పెళ్లి వయసు 21ఏళ్లు పెంచడాన్నే తీసుకోవచ్చు. ఒకప్పుడు ప్రతిఒక్కరికి ఉపాధి అభించేది ఎలానో ఒకలా జీవితం గడిచిపోయేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కెరీర్ లో సెటిల్ అవ్వాలంటేనే పాతికేళ్లు నిండిపోతున్నాయి.
Advertisement
అయితే పాతికేళ్ల వయసులో వివాహం చేసుకుంటే చాలా బెటర్ అని చెబుతుంటారు. నిజానికి 20 నుండి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉద్యోగం సాధించినా…డబ్బులు సంపాధించినా కూడా ఖర్చులు ఎక్కువగా చేస్తారట. అంతే కాకుండా ఆత్మవిశ్వాసం..సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా తక్కువగానే ఉంటుందట.
ALSO READ : Chanakya Niti : ఇలాంటి లైఫ్ పార్ట్‌నర్ దొరికితే వారికి అదృష్టమే అంటున్న చాణక్య
కాబట్టి 30 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదురుకునే సామర్థ్యం కలిగి జీవితంలో ముందుకు సాగుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీవిత భాగస్వామిని కూడా భాగా అర్థం చేసుకునేలా మారిపోతారట. నిజానికి పాతికేళ్లు దాటితే చాలు ఇంట్లోవాళ్లు చుట్టుపక్కల వాళ్లు పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు. కానీ జీవితంలో స్థిరపడనివాళ్లు 30వచ్చిన తరవాతే పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.