గర్భిణీలు డైట్ విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీలు కుంకుమ పువ్వుని తీసుకుంటూ ఉంటారు. అయితే గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకుంటే ఎలాంటి లాభాలను పొందవచ్చు..? ఏఏ సమస్యలకి చెక్ పెట్టవచ్చు అన్న విషయాలని ఇప్పుడు చూద్దాం. గర్భిణీలు మొదటి మూడు నెలలు కుంకుమపువ్వును తీసుకోకూడదు. అలా చేస్తే నొప్పి పెరగడంతో పాటుగా రకరకాల సమస్యలు వస్తాయి. కుంకుమ పువ్వుని ఏడవ నెలలో తీసుకోవచ్చు లేదంటే నాలుగు నెలలు దాటిన తర్వాత తీసుకోవచ్చు. కుంకుమపువ్వుతో గర్భిణీలు అనేక ప్రయోజనాలని పొందవచ్చు.
Advertisement
Advertisement
ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర పట్టదు. అలాంటప్పుడు దీన్ని తీసుకోవడం మంచిది. అలాగే గర్భం దాల్చినప్పుడు హార్మోన్స్ సమస్యలు వస్తాయి. ముఖంపై మచ్చలు వంటివి కూడా కలుగుతాయి. గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మూడ్ స్వింగ్స్ కూడా గర్భిణీలో ఎక్కువగా ఉంటాయి కుంకుమపువ్వు తీసుకుంటే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి.
Also read:
గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులు తొలగిపోతాయి కుంకుమ పువ్వు ని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే గర్భిణీలు కుంకుమ పువ్వును తీసుకుంటే బిడ్డ ఎదుగుదలకు కూడా బాగుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!