పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రెగ్యులర్ గా చాలామంది పెరుగు తింటూ ఉంటారు. పెరుగు తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఉండే ఆహార పదార్ధం పెరుగు. పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే చక్కటి లాభాలను పొందొచ్చు మరి పెరుగుతో వేటిని తీసుకుంటే మంచిదని విషయాన్ని చూద్దాం.. పెరుగు జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
Advertisement
పైగా బరువు పెరగడం అనే భయం ఉండదు. పెరుగులో బ్లాక్ సాల్ట్ వేసి తీసుకుంటే కూడా మంచిది గ్యాస్ ఎసిడిటీ వంట జీర్ణ సమస్యలు తొలగిపోతాయి ఏ ఇబ్బంది ఉండదు. పెరుగులో కొద్దిగా వాము వేసి తీసుకుంటే కూడా మంచిది. దంత సమస్యలు నోటి పూత వంటి సమస్యలు ఉండవు. ఒక కప్పు పెరుగులో కొంచెం వాము వేసి తీసుకోవడం వలన దంత సమస్యలు బాగా తగ్గుతాయి. అలానే నీరసం అలసట ఉన్నట్లయితే పెరుగులో కొద్దిగా చక్కెర వేసి తీసుకోండి తక్షణ శక్తి లభిస్తుంది అలానే మూత్రయ్య సంబంధిత సమస్యల నుండి కూడా ఉపసంహరణ లభిస్తుంది పెరుగులో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తీసుకోవడం వలన ఆహారం జీర్ణం అవడంలో ఇబ్బంది తొలగిపోతుంది.
Advertisement
Also read:
పెరుగులో మీరు కొద్దిగా పసుపు అల్లం కలిపి తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది గర్భిణీ మహిళలకి ఇది బాగా మేలు చేస్తుంది. పెరుగులో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటే అల్సర్ నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో కొద్దిగా కమల రసం వేసి తీసుకోవడం వలన విటమిన్ సి లభిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు కూడా దూరమవుతాయి. ఇలా పెరుగులో వీటిని కలుపుకుని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం పెట్టిన చూడండి!