సాధారణంగా కొత్తిమీర గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తిమీరను నాన్ వెజ్ రకం వంటకం, పప్పు వంటి వంటకాలు చేసిన సమయంలో మనం వినియోగిస్తుంటాం. కానీ కొంత మంది కొత్తిమీరను తినకుండా పక్కకు పెడుతారు. కొత్తిమీరలో చాలా ఔషద గుణాలుంటాయి. కొత్తిమీరను వంటల్లో వాడటం వల్ల మంచి సువాసనతో మంచి రుచి పెరుగుతుంది. కొత్తిమీర ఆహారంలో రుచిని రెట్టింపు చేయడమేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.
Also Read : Thati Munjalu: ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు
Advertisement
కొంత మంది కరివేపాకు, కొత్తిమీరను తీసి పక్కకు పెట్టి తింటుంటారు. కొత్తిమీరను కొన్ని రకాల కూరలు లేదా చెట్నీ చేసుకొని తింటే మంచి రుచితో పాటు ఆంటీ ఆక్సిడెంట్ ఎన్ని రకాలు సుగుణాలు విటమిన్, ఏ సి క్యాల్షియం, మెగ్నీషియం శరీరానికి పుష్కలంగా అందుతాయి. కొత్తిమీరలోని యాంటీబయోటిక్ మూలకాలు బ్లడ్ లోని షుగర్ లెవెల్సిన తగ్గించి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూలంగా కొత్తిమీర జ్యూస్ ను పరిగడుపున తాగితే మధుమేహం కంట్రోల్ లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర రసంలో కొంచెం చక్కర నీరు కలిపి ఖాళీ కడుపుతో వారం రోజులు పాటు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Advertisement
Also Read : త్రిష నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్..కారణం ఏంటో తెలుసా..?
లినోలిక్, ఫార్మేటిక్ లాంటి ఆసిడ్స్ కొత్తిమీరలో అధికంగా ఉంటాయి . ఇవి గుండేసంబంధిత సమస్యలు ప్రముఖ పాత్ర పోషించి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. నిత్యం కొత్తిమీర చట్నీ తినడం.. ధనియాల పొడిలో కొద్దిగా తేనె తీసుకుని తీసుకుండడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్తిమీర డైజేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో సోడియంను బయటికి పంపి రక్తపోటును తగ్గిస్తుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొత్తిమీరను నిత్యం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చు..