Home » రోజూ కాఫీ తాగుతున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..?

రోజూ కాఫీ తాగుతున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..?

by Sravanthi
Ad

చాలామంది రెగ్యులర్ గా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. మీరు కూడా టీ, కాఫీలు తీసుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. కాఫీలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి అలానే ఇతర పదార్థాలు కూడా కాఫీలో ఉంటాయి. కాఫీ బ్లాక్ అయిన నరాలను తెరుచుకునే విధంగా చేస్తుంది. అలానే నరాలను ఉత్తేజ పరుస్తుంది. కాఫీ ని లిమిట్ గా తీసుకోవడం మంచిది. చాలా మంది ఎక్కువగా కాఫీకి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు రోజుకి నాలుగు ఐదు కప్పుల వరకు కూడా తీసుకుంటుంటారు.

Advertisement

ఆ పొరపాటు చేయకండి కాఫీ ని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు అస్సలు కాఫీని అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. కాఫీ ని తీసుకోవడం వలన శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అలానే బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాఫీ ని తీసుకోవడం వలన షుగర్ తో బాధపడే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని కూడా అంటూ ఉంటారు. కప్పు కాఫీ తాగితే జీర్ణ క్రియలు బాగా జరిగి తక్షణ శక్తిని అందేటట్టు చేస్తాయి. అలసట కూడా దూరమైపోతుంది.

Advertisement

Also read:

కాఫీ తాగడం వలన ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి సాధారణంగా రోజుకి రెండు కప్పుల కాఫీ తీసుకుంటే మంచిదని డాక్టర్లు అంటున్నారు కానీ మోతాదుకు మించి కాఫీ తీసుకుంటే మాత్రం అనేక నష్టాలు వాటిల్లుతాయి. మోతాదుకు మించి కాఫీ తీసుకోవడం వలన నిద్రలేమి గుండె సమస్యలు వంటివి కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి కాఫీ తీసుకునే వాళ్ళు ఈ విషయాలను చూశారు కదా మరి ఇకమీదట ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading