Home » రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

చాలామంది మెడలో రుద్రాక్షలు వేసుకొని కనిపిస్తారు. మరి ఆ రుద్రాక్షలను ఏదైనా స్టైల్ కోసం వేసుకుంటారా.. కాదు కాదు ఏదైనా భక్తికి సంబంధించి దీక్ష తీసుకునే సమయంలో ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు. అయితే కొంతమంది ఇలాంటి రుద్రాక్షలను ఎల్లప్పుడు వేసుకొని ఉంటారు. అయితే రుద్రాక్షలు ఎందుకు ధరిస్తారు.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటి.. అనేది చాలా మందికి తెలియదు.. అవేంటో ఒకసారి చూడండి..!!అయితే ప్రస్తుత కాలంలో రుద్రాక్షలను కూడా మెడలో స్టైల్ గా ధరిస్తున్నారు. కానీ అవి పరమపవిత్రమైనవి శివుని అంశంగా భావిస్తారు.. శివుని కన్నీటి నుంచి జాలువారినవిగా చెబుతూ ఉంటారు. అయితే శివుడు 3 పురములను భస్మం చేసి అక్కడ చనిపోయిన వారిని చూస్తూ ఎంతో బాధపడతాడు. ఆ సమయంలో శివుడి కంటిలో నుంచి వచ్చిన కన్నీరు భూమిపై పడి చెట్లు పెరుగుతాయి. ఆ చెట్ల నుండి రుద్రాక్షలు వచ్చాయి అనేది పురాణాల్లో చెబుతున్నారు. ఇంతటి పవిత్రత కలిగిన రుద్రాక్షలు ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ రుద్రాక్షల్లో కూడా ఉసిరికాయంత పరిమాణం ఉన్న వాటిని ధరిస్తే చాలా మంచిది. రేగుపండు ఆకారంలో ఉన్న రుద్రాక్షలను మధ్యస్థ రుద్రాక్షలు అంటారు. శనగ గింజంత ఉన్న రుద్రాక్షలను అధమ రుద్రాక్షలుగా చెబుతారు. వాటి పరిమాణమును బట్టి మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో రంగులు కూడా ఉంటాయి. తెలుపు, నలుపు, తేనే రంగు రుద్రాక్షలు ఉంటాయి. తేనే రంగు ఉన్న రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది. ఇది ధరించిన వారు చాలా పరిశుభ్రంగా ఉండాలి. వీటిలో చాలావరకు విరిగిపోయినవి కానీ, పురుగులు పట్టినవి కానీ అసలు ధరించకూడదు. రుద్రాక్షలు ధరించడంలో కుల మత భేదాలు ఏమి ఉండవు. అయితే వీటిని సంభోగ సమయంలో వేసుకోరాదు. ఒకవేళ ఆ సమయంలో తెలియక మర్చిపోయిన వాటిని మళ్లీ ఆవు పాలతో శుభ్రం చేసి ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ 108 సార్లు చదివి మళ్ళీ ధరించాలి.

Advertisement

ALSO READ :

Advertisement

మునగ కాయ వల్లే కాదు.. మునగ ఆకు వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసా..?

క్యాన్సర్ ను గుర్తించండి ఇలా…?

 

 

Visitors Are Also Reading