Home » అప్పులపాలైన బెల్లంకొండ ను మళ్ళీ నిలబెట్టిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా…?

అప్పులపాలైన బెల్లంకొండ ను మళ్ళీ నిలబెట్టిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా…?

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండితెరకు పరిచయం అయిన ఈ నటుడు ఆఖరుగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు తెలుగులో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి చత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేశాడు. ఈ మూవీ మే 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ నటుడు పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ నటుడు మాట్లాడుతూ… నా తండ్రి ఒక నిర్మాత కావడం వల్లే నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అని అందరూ అంటారు… అది నిజమే. కాకపోతే నా కష్టం… నా హార్డ్ వర్క్ లేకపోతే నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. నేను మొదట అల్లుడు శీను మూవీలో హీరోగా నటించాను.

Advertisement

ఆ సినిమా మంచి విజయం అందుకుంది. దానితో నాకు వరుస అవకాశాలు లభించాయి. కాకపోతే ఆ సమయంలో మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మా నాన్న గారు వరసగా డిస్ట్రిబ్యూట్ చేసిన 8 సినిమాలు కూడా నష్టాలను మిగిల్చాయి. దానితో ఆ సమయంలో నాపై చాలా ప్రెషర్ ఉంది. దానితో నా తర్వాతి సినిమాను తక్కువ బడ్జెట్ తో చేశాను. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయక మూవీతో మా ఆర్థిక ఇబ్బందులు పోయాయి అంటూ ఈ యువ నటుడు చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading