ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రాధిక. ఇండస్ట్రీలో రాధిక ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకుని మరీ నిలదొక్కుకుందట. ఇక ఆమె వైవాహిక జీవితం కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండేది. దానికి కారణం రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమె విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చేది. అయితే ఇతరులను అనే ముందు ఆమె ఎలాంటి పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో కూడా ఆలోచించాలి. రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఆమె జీవితంలో ఎదురుకున్న సంఘటనలేనట.
1984 లో రాధిక దర్శకనిర్మాత అయిన ప్రతాప్ తో రాధికకు వివాహం జరిగింది. కానీ అతనో మనసులేని వ్యక్తి అని రాధికకు రెండేళ్లలోనే తెలిసింది. దాంతో రాధిక అతని నుండి విడిపోవాల్సి వచ్చింది. విడాకుల తరవాత ప్రతాప్ మీడియా ముందుకు వచ్చి రాధిక గురించి ఎంతో చెడుగా మాట్లాడాడు. కానీ రాధిక మాత్రం తన భర్త గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ తరవాత కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న రాధిక బ్రిటన్ దేశస్తుడు రిచర్డ్ ను పెళ్లి చేసుకుంది. అయితే వారి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. ఒక బాధను అర్థం చేసుకోవాలనే విషయం కూడా అతడికి తెలియదని తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అతడిని పెళ్లాడటమేనని పలు మార్లు ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement
కానీ అప్పటికే రాధికకు రిచర్డ్ తో ఓ కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు రేయన్ భర్తతో విడిపోయిన తరవాత రేయన్ ఏ తన సర్వస్వంగా బ్రతికింది. రిచర్డ్ తో పెళ్లి తరవత రాధిక తన ఆస్తిలో సగభాగాన్ని కోల్పోవాల్సి వచ్చిందట. సినిమా అవకాశాలేవీ రాలేదు…ఆ తరవాత రాధిక పూర్తి ఆస్తిని పోగొట్టుకుంది..అప్పులు కూడా చేసింది. చివరికి రాధికకు మిగిలింది ఒక్క ఇల్లు మాత్రమే…కానీ తరవాత సినిమాల్లోకి కాకుండా సీరియల్స్ లోకి అడుగుపెట్టింది రాధిక స్టార్ మళ్లీ తిరిగి సీరియల్స్ నిర్మాణంలోనూ సక్సెస్ అయ్యింది.
ఇక 1995 సంవత్సరంలో ప్రేమకావాలి సినిమా షూటింగ్ సమయంలో హీరో శరత్ కుమార్ రాధికను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశాడట. ఇక అప్పటికే తనకు పెళ్లి వల్ల జరిగిన అనుభవాలతో ఈ సారి నిర్ణయం తన పేరెంట్స్ కు వదిలేసిందట. కానీ పేరెంట్స్ కు నచ్చడంతో వారు రాధికను ఒప్పించి శరత్ కుమార్ తో వివాహం జరిపించారు.