చావు అనేది ఎప్పటికీ ఒక మిస్టరీనే…టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా చంద్రమండలం లో ఇల్లు కట్టుకున్నా చావును జయించడం ఎవరి తరమూ కాదు…కాలేదు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే…అయితే కాస్త ముందూ వెనక అంతే తేడా. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన నర్సు జూలీ చావు గురించి షాకింగ్ ఈ విషయాలను బయట పెట్టింది. జూలీ 14 ఏళ్లుగా లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా లాంటి నగరాల్లో పలు ఆసుపత్రుల్లో నర్సుగా పని చేసింది.
Advertisement
man-before-leaving
అయితే తాజాగా జూలీ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తన సర్వీస్ లో ఎంతోమంది కళ్ళముందు చనిపోవడం చూశానని వారి ప్రవర్తన ఎలా ఉంటుందో జూలీ వెల్లడించింది. చనిపోయే ముందు దాదాపు అందరి ప్రవర్తన ఒకే విధంగా ఉంటుందని జూలీ చెప్పుకొచ్చింది. చనిపోయేముందు ఎవరి శరీరమైనా నీలిరంగులోకి మారుతుందని తెలిపింది. అంతేకాకుండా చనిపోయే ముందు జ్వరం వస్తుందని చెప్పింది. చనిపోయేవారు ఆ విషయం తమకు ముందే తెలిసి తమకు ఇష్టమైన వారి పేరును పదే పదే తలుచుకుంటూ ఉంటారని తెలిపింది.
Ad
Advertisement
అంతేకాకుండా అప్పటికే చనిపోయినవారికి ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారని తెలిపింది. చనిపోయే ముందు నీడలను కూడా చూస్తారని వెల్లడించింది. తమకు చాలా దగ్గర అయిన చనిపోయిన వ్యక్తుల నీడను చూసి వారితో మాట్లాడతారని తెలిపింది. చాలా మంది అలా నీడలు చూస్తూ వారికి ఫోన్ చేయాలని ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా వారితో మాట్లాడుతూ నేను మన ఇంటికి వస్తున్నాను అని చెబుతారని తెలిపింది. చావు గురించి ఇతరుల కంటే తనకు చాలా విషయాలు తెలుసు అని జూలీ ఈ వీడియోలో షేర్ చేసింది ప్రస్తుతం జూలీ వీడియో వైరల్ అవుతోంది.