ప్రస్తుతం ప్రతి 10 మందిలో నలుగురికి గ్యాస్ సమస్య ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్ రావడానికి ముఖ్యంగా సమయానికి ఆహారం తినకపోవడం, బయటి ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం రకరకాల కారణాలతో గ్యాస్ సమస్య వస్తుంటుంది. ఇది తగ్గాలని రకరకాల మెడిసిన్‌ను వాడుతుంటారు. ఎక్కువగా మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మేరకు ప్రకృతిలో లభించే కొన్ని పండ్లతో మీరు సులభంగా మీ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఏ పండు ద్వారా గ్యాస్ సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా క్రేన్ బెర్రీస్ గ్యాస్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతాయి. ఇవి ఎక్కువగా డ్రై ప్రూట్స్ షాపుల్లో, ఆన్లైన్లో లభిస్తాయి. ఈ క్రేన్ బెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఏ, కే, బీ లతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. వీటిని తింటే ఆరోగ్యపరంగా చాలా లాభాలుంటాయి. గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు నుంచి కూడా శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి. ప్రధానం క్రేన్ బెర్రీస్ తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా అకస్మాత్తుగా గ్యాస్ సమస్య వస్తే ఈ చిట్కాను తయారు చేసుకోండి.
Advertisement
తొలుత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి రెండు స్పూన్ల క్రేన్ బెర్రీస్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఆ గోరు వెచ్చని నీళ్లలో ఒక స్పూన్ తేనే వేసి కలిపి తాగాలి. దీంతో గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి కూడా ఇది ఉపశమనం కలుగుతుంది. వడబెట్టిన తరువాత మిగిలిన ఉడికిన క్రేన్ బెర్రీస్‌ను పడవేయకుండా తినవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది కాస్త ఊరటనిస్తుంది. అదేవిధంగా చిగురు వాపు, దంతాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల అధిక బరువున్న వారు సులువుగా తగ్గుతారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రేన్ బెర్రీస్ తినండి. ఆరోగ్యంగా ఉండండి.
Also Read :
బిగ్ బాస్ 6లోకి ప్రముఖ హీరో.. రెమ్యూనరేషన్ ఎంత అడుగుతున్నారంటే..!!