సాధారణంగా కొంతమంది వ్యక్తుల హావభావాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ఊహించలేము. అకస్మాత్తుగా వారి మారుతుంటుంది. వారి మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టమనే చెప్పాలి. మాటల్లో, చేతల్లోకొన్ని మార్పులు కనిపిస్తుంటాయి. ఏ కారణం లేకుండానే కోపపడుతుంటారు. ఏమైందని ఇతరులు అడిగినా మానసిక కల్లోలం కారణంగా వారు అసలు స్పందించకపోవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం వారి భావోద్వేగాలను అసాధారణంగా ప్రేరేపించడం వల్ల ఇలా జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషం :
Advertisement
మానసిక స్థితి మారనంత వరకు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వంతో మెలుగుతుంటారు. ఎప్పుడు అయితే మానసికంగా అల్లకల్లోలంగా ఉంటారో చుట్టుపక్కల వారిపై కొరడా ఝులిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వైఖరి ఏ మాత్రం ఆరోగ్యకరంగా ఉండదు. వీరు ఇతరులకు ఏమాత్రం అర్థం కారు. సదరు వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియక వారికి దూరంగా వెళ్లిపోయే అవకాశముంది. మానసిక స్థితి మెరుగుపడినప్పుడు మేష రాశి వారు బాధపడుతుంటారు. అకారణంగా విలువైన స్నేహాన్ని కోల్పోయానని ఫీలవుతారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి మేషరాశి వారు ధ్యానం, యోగా వంటివి ప్రాక్టీస్ చేస్తుండాలి.
మిథునం :
Advertisement
ఈ రాశి వారు సాధారణంగా సానుకూల వ్యక్తిత్వంతో ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఎర్రని సూర్యుడిలా మండుతుంటారు. వీరు పనిలో ప్రతీ ఒక్కరితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. కలత లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు సైతం వారి ప్రవర్తన మామూలుగా ఉంటుంది. అయితే కోపం వచ్చినప్పుడు సన్నిహిత కుటుంబ సభ్యులు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. గాలి సంకేతం కారణంగా వారి బావోద్వేగాలు సులభంగా ప్రాసెస్ కావు. ఒకవేళ భావోద్వేగంగా కలత చెందితే ఇతరుల కంట కన్నీరు కారాల్సిందే.
కర్కాటకం :
ఈ రాశి వారు భావోద్వేగం పరంగా చాలా సున్నితంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు చంద్రుడి దశల మాదిరిగా వీరి ప్రవర్తన ఉంటుంది. నీటి సంకేతం కారణంగా నిరాశ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర రాశులకంటే కర్కాట రాశివారిలో చీకటి వినాశకరమైన రోజులు ఎక్కువగా ఉంటాయి.
సింహ రాశి :
కొందరూ వ్యక్తులు అన్ని విషయాల్లోనే చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఇతరులపై అసలు కోపపడరు. చాలా దయతో ఉంటారు. ఇలాంటి లక్షణాలున్న రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశి వారు చాలా మర్యాదగా నడుచుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తప్పు జరిగినప్పుడు ఎదుటివారికి క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. వీరికి సమాజంలో గౌరవం, ప్రతిష్ట ఉంటాయి.
తులరాశి :
ఈ రాశి వారు చాలా దయగలవారు. వీరికి కూడా నాయకత్వ లక్షణాలుంటాయి. తమ గౌరవాన్ని ఎలా కాపాడుకోవలో వారికి బాగా తెలుసు. ఇతరుల పట్ల సానుభూతి, దయతో మెలుగుతారు. చాలా నిజాయితీగా ఉంటారు. వినయం, దయ, నిజాయితీ న్యాయం వీరి లక్షణాలు.
ఇవి కూడా చదవండి: Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి