Home » భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

by Azhar
Ad
ఈ మధ్యే ఐపీఎల్ ను కరోనా బయో బాబుల్ లో విజయవంతంగా ముగించిన బీసీసీఐ.. ఆయా తర్వాత ఇండియాలో సౌత్ ఆఫ్రికాతో 5 టీ20 ల సిరీస్ నిర్వహించింది. కానీ ఇందులో చివరి మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడటంతో సిరీస్ ఫలితం తేలలేదు. ఇక ప్రస్తుతం భారత జట్టు ఒక్కటి ఇంగ్లాండ్ లో ఉండగా.. రెండో జట్టు ఈ నెల చివరన ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో హార్దిక్ పాండ్య భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్టుకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఇంగ్లాండ్ చేరుకున్న ఆటగాళ్లు అక్కడ ప్రాక్టీస్ తో పాటుగా షాపింగ్, ఔటింగ్ కూడా బాగానే చేస్తున్నారు. మ్యాచ్ కు ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో బయట తిరుగుతున్నారు. అలాగే లాడా అడిగిన ఫ్యాన్స్ అందరికి ఫోటోలు ఇస్తూ గడుపుతున్నారు. అయితే మన ఆటగాళ్లు ఇచ్చే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత కెప్టెన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ యొక్క ఫోటోలు ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇందులో ఏ ఫోటోలోను వారు మాస్కులు ధరించలేదు.
దాంతో ఈ విషయంలోనే బీసీసీఐ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే అందరూ మాస్కులు ధరించాలని పేర్కొంది. అయితే ఇన్ని రోజులు ఈ కరోనా కారణంగానే బయో బబుల్ లో మ్యాచ్ లు జరగగా.. ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని మ్యాచ్ లు మామూలుగానే జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా అలానే జరిగింది. కానీ ఆటగాళ్లు ఇలా తిరిగి కరోనా తెచ్చుకుంటే మళ్ళీ బయో బబుల్ పెట్టె అవకాశాలు కూడా లేకపోలేదు.

Advertisement

Visitors Are Also Reading