2008 లో బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ విజయవంతగా 15వ సీజన్ పూర్తి చేసుకుంది. అయితే గత ఏడాది వరకు 8 జట్లతో జరిగిన ఐపీల అనేది ఈ ఏడాది 10 జట్లతో జరిగింది. ఈ ఏడాది కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెంట్స్ జట్లు ఐపీఎల్ లోకి వచ్చాయి. అయితే ఈ రెండు కొత్త జట్లు కూడా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ కు చేరుకోగా లక్నో ఎలిమినేటర్ లో ఇంటికి వెళ్లగా… గుజరాత్ ఫైనల్స్ లో రాజస్థాన్ పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందం కూడా ముగిసింది.
Advertisement
ఇక వచ్చే ఐదు ఐపీఎల్ సీజన్లు అంటే 2023 నుండి 2027 వరకు మీడియా హక్కుల కోసం బిడ్డింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ 5 సీజన్లలో ఐపీఎల్ మ్యాచ్ లను పెంచాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే వచ్చే రెండు సీజన్ లు 2023, 2024 ఐపీఎల్ లో ఇప్పుడు ఉన్న విధంగానే 74 మ్యాచ్ లు జరుగుతాయి. కానీ ఆ తర్వాత రెండు సీజన్ లు అంటే 2025, 2026 ఐపీఎల్ లలో ఈ మ్యాచ్ ల సంఖ్యను 84 కు పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇక చివరి గా ఐపీఎల్ 2027 సీజన్ లో ఏకంగా ఈ సంఖ్యను 90 కి తీసుకపోనున్నట్లు తెలుస్తుంది.
Advertisement
అయితే ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ మీడియా హక్కుల కోసం బిడ్డింగ్ కు వచ్చేవారికి చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే బీసీసీఐ ఈ విషయంలో పక్క ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. వారిని అలాగే అమలు చేయబోతున్నట్లు సమాచార. అదే విధంగా ఈ మధ్య భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు ఒక్కే ఏడాది రెండు ఐపీఎల్ సీజన్లు నిర్వహించాలని కూడా బీసీకా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి అది ఇప్పుడు అమలు చేస్తుందా.. లేక 2027 సీజన్ ముగిసిన తర్వాతన అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :