Home » కోహ్లీకి వ్యతిరేకంగా మరోసారి బీసీసీఐ..!

కోహ్లీకి వ్యతిరేకంగా మరోసారి బీసీసీఐ..!

by Azhar
Ad

భారత మాజీ కాప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి బీసీసీఐ వ్యతిరేకంగా మాట్లాడింది. అయితే బీసీసీఐకి కోహ్లీకి దాదాపుగా ఈ ఏడాది ప్రారంభం నుండే పడటం లేదు. అప్పుడే కోహ్లీ ఏకంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసాడు. కానీ ఆ తర్వాత ఆ గొడవ అనేది ఆకడిహో సద్దు మణిగింది అని అనిపించింది. కానీ అది కోల్డ్ వార్ గా మారిపోయిన ఇప్పటివరకు వచ్చి.. మళ్ళీ బయటకు వచ్చింది.

Advertisement

అయితే ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న భారత జట్టు గత ఆదివారం పాకిస్థాన్ తో సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చి… తన కెప్టెన్సీ విషయం తెచ్చాడు. నేను టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత నాకు కేవాళ్ళం ఒక్క ధోని మాత్రం కాల్ చేసాడు అని.. మిగిలినవారు ఎవరు అలా చేయలేదు అని పేర్కొన్నాడు.

Advertisement

ఇక కోహ్లీ యొక్క ఈ కామెంట్స్ పైన తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. అసలు కోహ్లీ ఎం మాట్లాడుతున్నాడో మాకైతే అర్ధం కావడం లేదు అని ఆ సదరు అధికారి పేర్కొన్నాడు. విరాట్ టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత బీసీసీఐలోని అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందించాం అని గుర్తు చేసారు. ఇక అతను ఫామ్ కోల్పోయిన సమయంలో కూడా బీసీసీఐ అతనికి అండగా ఉంది అని చెప్పాడు. మరి ఇప్పుడు కోహ్లీ ఈ కామెంట్స్ పైన స్పందిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్న అర్ష్‌దీప్..!

Visitors Are Also Reading