ఐపీఎల్ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది బీసీసీఐ. మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది 2008 లో ప్రారంభించిన ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్పోర్ట్స్ లీగ్ గా నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ ఒక్కటే మన బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా మలిచింది. మనం ఇప్పుడు ఐసీసీనే శాసించే స్థాయిలో ఉన్నం అంటే దానికి కారణం కూడా ఐపీఎల్ అనే చెప్పాలి. అయితే ఇంతలా లాభాలు తెచ్చిన ఐపీఎల్ అనేహి ఇప్పుడు బీసీసీఐకి కష్టాలను నష్టాలను కూడా తెస్తుంది. అందుకు కారణం గత సీజన్.
Advertisement
అయితే ఐపీఎల్ 2020, 21 సీజన్లు ఊహించని స్థాయిలో రేటింగ్స్ అనేవి అందుకున్నాయి. అందువల్ల ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ కు స్పాన్సర్లు భారీగా రాగ.. వారి వద్ద నుండి అదే రేంజ్ లో డబ్బుకు కూడా అందుకుంది బోర్డు. కానీ కారణాలు ఏమో తెలియదు కానీ.. ఈ ఐపీఎల్ సీజన్ అనేది అనుకున్న విధంగా సాగలేదు. రేటింగ్స్ అనేవి గత రెండు సీజన్స్ తో పోల్చితే విపరీతంగా పడిపోయాయి. అందువల్ల స్పాన్సర్లు అందరూ బీసీసీఐపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ కూడా తమ డబ్బులు అనేవి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Advertisement
ఇక ఇప్పుడు తాగాజా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండియాలో జరిగే సిరీస్ లకు స్పాన్సర్ గా వ్యవరిస్తున పేటిఎం అనేది ఇప్పుడు బీసీసీఐతో కనెక్షన్స్ అనేవి తెచ్చుకునేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. 2019 లో బీసీసీఐతో ఈ స్పాన్సర్ ఒప్పందం అనేది నాలుగు ఏళ్లకు కుదుర్చుకుంది పేటిఎం. అంటే 2023 వరకు ఈ ఒప్పందం అనేది ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పేటిఎం ఇంకో ఏడాది మిగిలి ఉండగానే తన టైటిల్ స్పాన్సర్షిప్ ను వదులుకోవాలని ,భావిస్తుంది. అలాగే తమ డీల్‌స్ అనేవి ప్రముఖ ‘మాస్టర్ కార్డ్’ కు మళ్లించాలని కూడా ఓ ప్రతిపాదనను పేటిఎం పెట్టినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి :