భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు బీసీసీఐలో దుమారం రేపిన విషయం తెలిసిందే. సాహా.. తన ట్విట్టర్ వేదికగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు తనను ఇంటర్వ్యూ కోసం సంప్రదించాడని.. కానీ తాను ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగాడు అని తెలిపాడు. తనను బెదిరిస్తూ పంపిన మెసేజ్ లను కూడా పోస్ట్ చేసాడు. కానీ ఆ జర్నలిస్టు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈ విషయాని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది.
Advertisement
Advertisement
సాహా చేసిన ఆ వ్యాఖ్యలు తక్కువ సమయంలోనే వైరల్ కావడంతో… ఈ ఘటన పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, సభ్యుడు ప్రభ్‌తేజ్ భాటియాలతో కూడిన ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ జర్నలిస్టును నేనేనని.. కానీ నిను సాహాను బెదిరించలేదు అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ తెలిపారు. దాంతో ఈ విషయంలో తర్వాత ఏం జరుగుతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను బోర్డుకు అందజేసింది. దాంతో ఈ నెల 23న బోర్డు ఉన్నతస్థాయి అధికారులు ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి… దానిపై చర్యలు తీసుకొనునట్లుగా తెలుస్తుంది. అయితే భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన సాహా ఇప్పుడు ఐపీఎల్ 2022 లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.