Home » Barrelakka: సిగ్గులేకుండా మొగుడితో విడాకులు తీసుకుంది.. బర్రెలక్క బాగోతం బయటపెట్టిన తండ్రి !

Barrelakka: సిగ్గులేకుండా మొగుడితో విడాకులు తీసుకుంది.. బర్రెలక్క బాగోతం బయటపెట్టిన తండ్రి !

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు వెలుపడతాయి. ఇలాంటి నేపథ్యంలో…. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కంటే అందరి చూపు కొల్లాపూర్ నియోజక వర్గం పైనే ఉంది. దీనికి కారణం కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్న బర్రెలక్క. బర్రె లక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని అప్పట్లో బర్రెలు కాచుకుంటూ వీడియో పెట్టింది. దీంతో కొల్లాపూర్ కు చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క పాపులర్ అయింది.

Advertisement

అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది బర్రె లెక్క. అటు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఇటు కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఇలాంటి అగ్ర నాయకుల మధ్యలో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా బర్రె లెక్క గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో బర్రెలక్కపై… ఆమె తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె తండ్రి వీడియో వైరల్ గా మారింది.

Advertisement

barrellaka

barrellaka

బర్రెలక్క పేరుతో తన కూతురు పోటీ చేస్తుందని…. ఆమెకు కొంచెం కూడా సిగ్గు లేదని ఆగ్రహించాడు. చిన్నప్పటి నుంచి చదువుకోమంటే… సరిగా చదువుకోలేదని మండిపడ్డాడు. కూతురు జీవితం బాగుండాలని ఇంటర్మీడియట్ మరియు అగ్రికల్చర్ కోర్స్ చదివించాలని… కానీ అందులో కూడా బర్రెలక్క రాణించ లేదని ఆమె తండ్రి వివరించాడు. ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే… తన భర్తకు విడాకులు ఇచ్చిందని కూతురుపై నిప్పులు చెరిగారు. పదో తరగతి చదువుటప్పుడు అమ్మ తిడుతుంది అందరి తిడుతున్నారని స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకుందని ఆమె తండ్రి మీడియాకు చెప్పాడు. దీంతో బర్రెలక్క తండ్రి వీడియో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading