మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సినీ కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ కార్మికులు చిరంజీవిని సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలని కోరారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎవరూ లేరని అన్నారు. అయితే చిరంజీవి మాట్లాడుతూ…. పెద్దదిక్కు హోదాని తిరస్కరించారు. తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలని అనుకోవడం లేదని అన్నారు. ఆ హోదా తనకు అసలు వద్దని బాధ్యత కలిగిన పరిశ్రమ బిడ్డగా అవసరమైన సమయంలో ముందు ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు.
Advertisement
Advertisement
అవసరమైన వారికి సాయం చేస్తానని కానీ యూనియన్ల పేర్లతో కొట్లాడుకుని తన వద్దకు ఎవరూ రావద్దని మెగాస్టార్ అన్నారు. దాంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా తాజాగా ఈ వ్యాఖ్యల పై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. చిరంజీవి మాట్లాడిన వీడియోను షేర్ చేసి బండ్ల గణేష్ “సూపర్ సార్ బాగా చెప్పారు” అంటూ కామెంట్ పెట్టారు. ఇక చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి.