టాలీవుడ్ కు నటుడిగా పరిచయమైన బండ్లగణేష్ పర్సనల్ లైఫ్ గురించి మొదట్లో ఎవరికీ తెలియదు. కానీ బండ్ల గణేష్ నిర్మాతగా పరిచయమైన తర్వాత ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. బండ్ల గణేష్ ప్రముఖ వ్యాపారి కాగా సినిమాలపై ఉన్న ఆసక్తితో నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించారు. రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమాను నిర్మించారు. రెండు సినిమాలు అనుకున్న మేర విజయం సాధించలేదు.
Advertisement
తీన్మార్ సినిమా ఫ్లాప్ అవడంతో బండ్లగణేష్ కు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో మరో ఆఫర్ ఇచ్చారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవడంతో బండ్ల గణేష్ పేరు నిర్మాతగా మారుమోగిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా ఒక్కటి కూడా పెద్ద విజయం సాధించలేదు. ఇక రాజకీయాలపై ఆసక్తి తో బండ్ల గణేష్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తరచూ ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ గా మారారు.
Advertisement
ఆ తర్వాత రాజకీయాలు తనకు సెట్ కావని గ్రహించి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు. ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. బండ్ల గణేష్ హీరోగా డేగల బాబ్జీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఇక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ నెటిజన్ల ట్వీట్లకు సమాధానాలు కూడా ఇస్తుంటారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతుంటాయి.
తాజాగా బండ్ల గణేష్ కు ఓ అభిమాని…..అన్న మీరు బిజెపిలో చేరాలని నా కోరిక… నేను కూడా మీ అభిమాని. మీరు చాలా బాగా మాట్లాడతారు. అని ట్వీట్ చేశారు. దానికి బండ్లగణేష్ స్పందించారు. ప్లీజ్ రాజకీయాల గురించి వద్దు అంటూ దండం పెడుతూ రిప్లై ఇచ్చారు. ఇక గతంలో బండ్ల గణేష్ కు రాజకీయాల్లో ఎదురైన ఇబ్బందులు తెలిసిందే. బండ్ల గణేష్ ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్లతో నవ్వుల పాలు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.