తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కెరియర్ను మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన “ఆంజనేయులు” మూవీతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత తీన్మార్, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, బాద్ షా వంటి సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయాడు.
Advertisement
ఈ నిర్మాత ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతోనూ… డైరెక్టర్లతోను సినిమాలు చేయడం ద్వారా అతి తక్కువ కాలంలోనే ఈయనకు నిర్మాతగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్… ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి టెంపర్ మూవీ తర్వాత సినిమాను నిర్మించలేదు.
Advertisement
అలాగే ఈ మూవీ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా ఈయన దూరంగా ఉన్నాడు. కొంతకాలం క్రితం సరిలేరు నీకెవరు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను నవ్వించిన ఈ నటుడు కొంతకాలం క్రితం డేగల బాబ్జి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ ప్రముఖ నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దేవర అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అలాగే ఈ టైటిల్ తో సినిమాను నిర్మించేందుకు కూడా బండ్ల గణేష్ చాలా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కాకపోతే దేవర అనే టైటిల్ తో సినిమా చేయాలి అని ఈయన అనుకున్నప్పటికీ ఆ టైటిల్ ను ఫీలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయడం మర్చిపోయాడట, అలా ఒక అద్భుతమైన పవర్ఫుల్ టైటిల్ ను ఈయన రిజిస్టర్ చేయడం మర్చిపోవడంతో ఇదే టైటిల్ ను ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీకి టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇలా బండ్ల గణేష్ చేసిన తప్పు ఎన్టీఆర్ కు అదిరిపోయే రేంజ్ లో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.