తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు బహిరంగ లేఖ రాసారు. పంచాయతీ కార్యదర్శుల పై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. అదేవిధంగా ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యకృత్యంగా మారడం అత్యంత దారుణం అన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగిగా క్రమబద్దీకరించి.. పే స్కేల్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కచ్చితమైన పని గంటలు నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
Also Read : ఈ రాజు దేశంతో పాటు తన ఫ్యామిలీకి కూడా సెపరేట్ బడ్జెట్ ప్రకటించుకుంటాడు!
Advertisement
Advertisement
ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైందన్నారు. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ వరకు పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని బండి సంజయ్ రాసిన లేఖలో గుర్తు చేసారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శిలపై నిత్యం దాడులు జగడం బాధకరమని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపి వారికి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Also Read : Undavalli Arun Kumar : ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధానే చెప్పారు..ఆ సమయంలో..!
తెలంగాణ రాష్ట్రంలో 12,765 గ్రామపంచాయతీలలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శిలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు, సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులపై తరుచూ ఏదో ఒక చోట అధికార పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. మరికొన్ని చోట్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.