Home » చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే… ఏజెంట్ అంటారు… వైసీపీపై బండి సంజయ్ సంచలనం !

చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే… ఏజెంట్ అంటారు… వైసీపీపై బండి సంజయ్ సంచలనం !

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. పక్క ఆధారాలతో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు… కోర్టు కు సాక్షాలను అప్పగించారు.

Advertisement

ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు స్పందిస్తున్నారు. ఇక బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం స్పందించారు. చంద్రబాబు పట్ల కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కోట్లాడాలి కానీ ఇలా చేయడం వల్ల వైసీపీ వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారన్నారు.

Advertisement

మరి బండి సంజయ్ చేసిన వాక్యాలపై వైసిపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. చంద్రబాబును ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పని అంటున్నారని తెలిపారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారనేది స్పష్టంగా కనపడుతుందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరు కాదనరని తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారనేది అర్థం కావడం లేదని చెప్పారు. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగా కోట్లాడాలని అన్నారు.

Visitors Are Also Reading