ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఆయన లవ్వు, యాక్షన్, పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారు.. అయితే ఆయన నటించిన పౌరాణిక మూవీ భైరవ ద్వీపం అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.. సెన్సార్ బోర్డుకు కూడా షాక్ ఇచ్చింది.. అవేంటో చూద్దామా.. అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే భైరవద్వీపం మూవీ చాలా అద్భుతంగా మలిచారు..
Advertisement
అలాగే ఈ సినిమాకు ఒక్క సెన్సార్ కట్ లేకుండా రిలీజ్ చేశారట.. అంటే ఈ మూవీ సెన్సార్ పూర్తయిన తర్వాత వాళ్లు ఒక సూచన చేశారు. గుర్రాలు కింద పడిపోయిన షాట్స్ మా వరకు ఏ అభ్యంతరం లేదు కానీ వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు అభ్యంతరం చేస్తే మాత్రం ఆ గుర్రాలు పడిపోయే షాట్స్ తొలగించాల్సి వస్తుందని చెప్పారు. కానీ ఆ సన్నివేశాలు వారి దృష్టిలో పడలేదు. ఆ షార్ట్స్ కూడా తప్పించుకు నాయి. కానీ గుర్రాలు పడి పోయే విధానం చూస్తే మాత్రం వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు సహించరు అని చెప్పవచ్చు. గుర్రాలు చాలా వేగంగా పరిగెడుతూ వస్తూ ఉంటాయి.
Advertisement
వాటి కాళ్ళకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు. ఆ వైర్లు తాకగానే అవి కింద పడి పోతాయి. ఆ సమయంలో వాటికి కాలు కూడా విరగవచ్చు. గాయాలు కావచ్చు. కాస్త రిస్క్ తో కూడుకున్న సన్నివేశం.. అది పూర్తయిన వెంటనే గుర్రాలను అక్కడే ఉన్న వైద్యునికి చూపించి వాటికి చికిత్స చేయించే వాళ్ళు. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తిరిగి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించడమే కాకుండా, ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా అప్పట్లో చరిత్ర సృష్టించింది.
also read:
- ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్ పై అనురాగ్ కశ్యప్ ఏమన్నారో తెలుసా..?
- సీతారామం సినిమాకు ఇప్పటివరకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?